ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్టును రద్దు చేసింది. హసీనా హయాంలో ఎంపిలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. షేకహేసీనా ఈ నెల 5 నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్ సారథిగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వమే పాస్‌పోర్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది. తాజా నిర్ణయంతో హసీనా దౌత్యపరంగా ఉన్న అన్ని వెసులుబాట్లు లేకుండాపోతాయి. ఆ పాస్‌పోర్టు వల్లే ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు.