Bangladesh: మాజీ ప్రధాని షేక్‌ హసీనా @ 100

Aug 30,2024 18:54 #Bangladesh, #Case count, #Sheikh Hasina

ఢాకా : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 100ను దాటింది. ఈ కేసుల్లో హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు సహా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి, దేశాన్ని విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 13న ఢాకాలో ఆమెకు వ్యతిరేకంగా మొదటి కేసు నమోదవగా, 100 వకేసు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌లో గురువారం ఫైల్‌ అయింది.

తాజా కేసులో హసీనాతో పాటు పలువురు మాజీ మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, జర్నలిస్టులు ఉన్నారు. ఫిర్యాదులో మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు ఉన్నాయి. వీటిలో 8 అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌కు పంపారు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో 92 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 100కి చేరింది. వీటిలో ఒక కిడ్నాప్‌ కేసు కూడా ఉన్నాయి.

➡️