జర్మనీ ఛాన్సలర్‌గా ఫ్రెడరిక్‌ మెర్జ్‌ విజయం

బెర్లిన్‌ : జర్మనీ ఛాన్సలర్‌గా కన్జర్వేటివ్‌ నేత, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ (సిడియు) అభ్యర్ధి ఫ్రెడరిక్‌ మెర్జ్‌ మంగళవారం ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో రెండో రౌండ్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయన గెలుపొందారు. తొలి రౌండ్‌లో పూర్తి మెజారిటీకి 316 ఓట్లు అవసరం కాగా, ఫ్రెడరిక్‌ మెర్జ్‌కు ఆరు ఓట్లు తక్కువగా 310 ఓట్లే లభించాయి. 325మంది సభ్యులు గల పార్లమెంట్‌లో ఈసారి ఆయనకు 325ఓట్లు లభించాయి. పార్లమెంట్‌లో స్వంత సంకీర్ణ కూటమికి 328 సీట్లు వున్నందున గెలుపు సులభమేనని భావించిన తరుణంలో అందుకు విరుద్ధంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. మొదటి రౌండ్‌లో రహస్య ఓటింగ్‌ జరగ్గా ఆయన ఓడిపోయారు. రెండో రౌండ్‌లో 325 ఓట్లు గెలిచి జర్మనీ 10వ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

➡️