ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ సంచలన ప్రకటన

పారిస్‌ :    ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మేక్రాన్‌ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్‌ను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు (స్నాప్‌ ఎలక్షన్స్‌) ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మెరెన్‌ లెపెన్‌కి చెందిన మిత వాద నేషనల్‌ ర్యాలీ (ఎన్‌ఆర్‌) పార్టీ దూసుకుపోతుందని, మేక్రాన్‌ కూటమి పరాజయం పాలవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

యూరోపియన్‌ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని విస్మరిస్తున్నట్లు నటించలేనని మేక్రాన్‌ పేర్కొన్నారు.  జూన్‌ 30న తొలివిడత, జులై 7న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు.

ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. నేషనల్‌ ర్యాలీ పార్టీ 32 శాతం ఓట్లను గెలుచుకోగా, మేెక్రాన్‌ రెనాయిసెన్స్‌ పార్టీకి 15 శాతం, సోషలిస్ట్‌ పార్టీకి 14 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

➡️