Gaza : గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం దాడులు : 20 మందికిపైగా మృతి

Dec 11,2024 17:10 #Bomb Attack, #Gaza, #Israel

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ సైన్యం ఏడాదికి పైగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా బుధవారం ఉదయం ఇజ్రాయిల్‌ సైన్యం దాడులకు తెగబడింది. గాజాస్ట్రిప్‌ లక్ష్యంగా దాడులు కొనసాగించింది. ఉత్తరాగాజాలోనూ, గాజాస్ట్రిప్‌ సెంటర్‌లో ఉన్న నివాస భవనాలపై బాంబు దాడి చేసింది. ఈ దాడిలో మహిళలు, చిన్నారులతో సహా కనీసం 20 మందికికి పైగా మృతి చెంది ఉంటారని వైద్య వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇక బుధవారం తెల్లవారుజామున ఉత్తరాగాజాలోని కమల్‌ అద్వాన్‌ ఆసుపత్రికి సమీపంలోని బీట్‌ లాహియాలోని నివాస భవనంపై బాంబు దాడి చేసింది. ఇందులో ఉన్న నివాసితులు అక్కడి నుంచి పారిపోయారు.

➡️