మరోసారి ఉద్యోగులపై వేటు వేసిన గూగుల్‌

వాషింగ్టన్‌ : గూగుల్‌ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది. తమ ప్లాట్‌ఫామ్‌, డివైజ్‌ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్‌, పిక్సెల్‌ ఫోన్స్‌, క్రోమ్‌ బ్రౌజర్‌లలో పనిచేసే ఉద్యోగులను తొలగించనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

ఖర్చు తగ్గింపుల పేరుతో గత రెండేళ్లలో గూగుల్‌ పలువురు ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో మేనేజర్‌, డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాల్లో పనిచేస్తున్న వారిపై 10శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఆర్‌ విభాగం, క్లౌడ్‌ ఆర్గనైజేషన్‌లో కొంతమందిని తొలగించింది.

➡️