లెబనాన్‌, సిరియాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులు : హిజ్బుల్లా కమాండర్స్‌ మృతి

Oct 10,2024 17:30 #Israel Attack

లెబనాన్‌ : లెబనాన్‌, సిరియాల్లో ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడిలో దక్షిణ గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా నగరమైన ఖాన్‌ యూనిస్‌లో నలుగురు పాలస్తీనియన్లను, జబాలియా శరణార్థి శిబిరంలో ముగ్గురిని ఇజ్రాయెల్‌ దళాలు హతమార్చాయి. దీంతో ఐక్యరాజ్యసమితి ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆసుపత్రుల్ని మూసివేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన వైమానిక దాడిలో ఐదుగురు వైద్యసిబ్బంది మృతి చెందారు. అలాగే సిరియాలోని ఇళ్లపైనా, హమా ప్రావిన్సులపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఓ కారు ప్లాంట్‌ను, మిలటరీ స్థావరాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం ధ్వంసం చేసింది.
కాగా, గురువారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌లో ఇద్దరు హిజ్బుల్లా కమాండర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అలాగే సిరియాలో ఇళ్లపైనా, గోలన్‌ హైట్స్‌లో ఉన్న హిజ్బుల్లా కమాండర్లను చంపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే ఇప్పటివరకూ వీరి మృతిపై హిజ్బుల్లా స్పందించలేదు.

➡️