లక్నో : ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య కేసులో దోషులుగా నిర్ధారణ అయిన జంటకు మరణశిక్ష విధిస్తూ లక్నో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అజయ్ సింగ్, అతని భార్య రూపాసింగ్ 2020లో ఈ దారుణానికి పాల్పడ్డారు. అజయ్ సింగ్ తల్లిదండ్రులు రామ్ దులారి, అమర్‌సింగ్, సోదరుడు అరుణ్‌సింగ్, వదిన రామ్‌సఖి, వారి పిల్లలు సౌరభ్, సారికలను వీరు కాల్చి చంపారు. అజరుసింగ్ సోదరి దుర్గావతి ఫిర్యాదు మేరకు బంత్రా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. భూమిని అమ్మిన డబ్బు మొత్తం అన్నావదినలకు ఇస్తాడేమోనన్న అనుమానంతో తండ్రితోపాటు కుటుంబ సభ్యులందరినీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గత ఏడాది డిసెంబర్ 16న అజయ్ సింగ్, రూపాసింగ్‌లను దోషులుగా లక్నో కోర్టు నిర్ధారించింది. వారికి మరణశిక్షను శుక్రవారం ఖరారు చేసింది.
