అమెరికా ఆంక్షలను ఖండించిన ఐసిసి

బాధితులకున్యాయం జరిగేలా చూస్తామనిహామీ
ఐసిసి ఉద్యోగుల ఆస్తులను స్తంభింప చేస్తూ ట్రంప్‌ ఉత్వర్వులు
ది హేగ్‌, వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా నిలబడాల్సిందిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి) తన సభ్య దేశాలకు పిలుపిచ్చింది. తమ స్వతంత్ర, నిష్పాక్షిక జ్యుడీషియల్‌ కార్యకలాపాలకు హాని కలిగించాలనుదే ఈ చర్యల ఉద్దేశ్యమని విమర్శించింది. ఐసిసిపై ఆంక్షలు విధిస్తూ అమెరికా తీసుకును చర్యను శుక్రవారం ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకుఐసిసి ఒక ప్రకటన విడుదల చేసింది. న్యాయం కసం, ప్రాధమిక మానవ హక్కుల పరిరక్షణ కోసం సమైక్యంగా నిలబడాల్సిందిగా 125 సభ్య దేశాలకు, పౌర సమాజ సంస్థలకు, అన్ని దేశాలకు పిలుపిచ్చింది. మానవ హక్కుల గ్రూపులు అమెరికా నిర్ణయానిు ఖండించాయి. సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్న వారికి ఈ ఆంక్షలను ఒక బహుమతిగా అందించారంటూ విమర్శించాయి. అమెరికా, దాని మిత్రపక్షం ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన దర్యాప్తులు చేపడుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహకు అరెస్టు వారంటు జారీ చేయడం ద్వారా ఐసిసి తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందనిట్రంప్‌ విమర్శించారు. చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకుపాల్పడుతోందంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐసిసి అధికారుల, ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల ఆస్తునలు స్తంభింప చేస్తూ, వారి ప్రయాణాలపై నిషేధం విధించారు.

➡️