ఇమ్రాన్‌ ఖాన్‌కు 12 కేసుల్లో బెయిల్‌..!

Feb 10,2024 13:15 #bail petition, #Imran Khan

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. పాక్‌ ఆర్మీ ఆస్తులపై జరిగిన దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు బెయిల్‌ దొరికింది. గతేడాది మేలో సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. వీటిలో మొత్తం 12 కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌, పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి షా మొహమూద్‌ ఖురేషీలకు శిక్ష పడింది. ఈ కేసుల్లో పాకిస్థాన్‌ లోని ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మాజీ విదేశాంగ మంత్రికి 13 కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసినట్లు సమాచారం.

➡️