చైనాలో దారుణం.. కత్తితో యువకుడు విచక్షణారహితంగా దాడి

Nov 17,2024 07:53 #17 injured, #8 death, #attck, #China
  • 8 మంది విద్యార్థులు మతి, 17 మందికి గాయాలు

వుషీ : చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా చేసిన దాడిలో 8 మంది మృతి చెందారు. మరో మరో 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన చైనా తూర్పు నగరం వుషీలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 21 సంవత్సరాల యువకుడని.. వుషీ వొకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్ధి అని తెలిపారు. పరీక్షలో ఫెయిల్‌ కావడం, డిగ్రీ సర్టిఫికెట్‌ అందుకోలేకపోవడం, ఇంటర్న్‌షిప్‌ ఉపకార వేతనం అందకపోవడంతో అసంతప్తితో ఉన్మాదిగా ప్రవర్తించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️