న్యూఢిల్లీ : భారత్ 2025-26 సంవత్సరానికి ఐరాస శాంతి పరిరక్షక కమిషన్ (పిబిసి)కి తిరిగి ఎన్నికైంది. కమిషన్‌లో భారత దేశ ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది.
”భారత్ 2025-26 సంవత్సరానికి యుఎన్ శాంతి పరిరక్షక కమిషన్‌కు తిరిగి ఎంపికైంది. పిబిసి వ్యవస్థాపక సభ్యులిగా, ప్రధాన సహకారిగా, ప్రపంచ శాంతి మరియు స్థిరత్వం కోసం పనిచేయడానికి పిబిసితో తమ సహకారాన్ని కొనసాగించడానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత కమిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
పిబిసి సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలి మరియు ఆర్థిక, సామాజిక మండలి నుండి ఎన్నికైన 31 సభ్యదేశాలను కలిగి ఉంటుంది. ఐరాసలో ఆర్థికసహకారం అందించే దేశాలు, అగ్రదళం, సహకార దేశాలు కూడా సభ్యులుగా ఉంటాయి. యుఎన్ శాంతి పరిరక్షణకు అత్యధిక సిబ్బందిని అందించిన దేశాలలో భారత్ కూడా ఒకటి.
ఇది ప్రస్తుతం అబై, సెంట్రల్ అమెరికన్ రిపబ్లిక్, సైప్రస్, డెమోక్రటిక్ రిపబ్లికన ఆఫ్ కాంగో, లెబనాన్ మిడిల్ ఈస్ట్, సోమాలియా, సౌత్ సూడాన్, వెస్ట్రన్ సహారాలో యుఎన్ కార్యకలాపాలకు సుమారు ఆరువేల మంది సైనిక, పోలీస్ సిబ్బందిని మోహరించింది. సుమారు 180మంది శాంతి పరిరక్షకులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు.
పిబిసి సంఘర్షణ ప్రభావిత దేశాలలో శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంతర ప్రభుత్వం సలహా సంస్థ. విస్తృత శాంతి అజెండాలో అంతర్జాతీయ సంఘం సామర్థ్యానికి కీలకంగా, అదనంగా పనిచేస్తుంది.