అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరపనున్న ఇరాన్‌

Apr 11,2025 14:48 #America, #Iran

వాషింగ్టన్‌ : అణు ఒప్పందానికి సంబంధించి తమతో చర్చిచడానికి అమెరికాకు ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నట్లు ఇరాన్‌ శుక్రవారం వెల్లడించింది. అణు ఒప్పందానికి సంబంధించి ఇరాన్‌, అమెరికా ఇరుదేశాలు శనివారం (ఏప్రిల్‌ 12) ఒమెన్‌ రాజధాని మస్కట్‌లో చర్చలు జరపనున్నాయి. ఇరాన్‌తో తన పరిపాలనా అధికారులు చర్చలు జరపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 7వ తేదీన ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్‌ ప్రకటన మేరకు ఇరాన్‌ కూడా అమెరికాతో చర్చించడానికి సిద్ధమైంది.
కాగా, మేము అమెరికాతో దౌత్య సంబంధాలపై చర్చించడానికి పూర్తి చిత్తశుద్ధితోనూ, మరింత అప్రమత్తతో కూడిన ఓ మంచి అవకాశాన్ని అమెరికాకు ఇస్తున్నాము. మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అభినందించాలి. అమెరికా తన శత్రుత్వ వైఖరిని పక్కనపెడితే ఏ ఒప్పందమైన సాధ్యం’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎస్మాయిల్‌ బఖై ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. రేపు జరగబోయే ఇరు దేశాల నేతల చర్చల్లో చమురు, అణు ఒప్పందాల లక్ష్యంగానే జరగనున్నాయి.

➡️