జపాన్‌ కొత్త ప్రధానిగా ఇషిబా

టోక్యో : జపాన్‌ పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డిపి) కొత్త నేత షిగెరు ఇషిబా మంగళవారం కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అసాధారణ జరిగిన పార్లమెంట్‌ సమావేశంలో జరిగిన ఓటింగ్‌ సందర్భంగా ప్రతినిధుల సభలో 461 ఓట్లకు గానూ 291 ఓట్లను, కౌన్సిలర్ల సభలో 242 ఓట్లకు గానూ143 ఓట్లను గెలుచుకున్న ఇషిబా దేశ 102వ ప్రధానిగా లాంఛనంగా ఎన్నికయ్యారు. రక్షణ, వ్యవసాయ, అటవీ, మత్స్య శాఖల మంత్రిగా పనిచేసిన ఇషిబా ఎల్‌డిపి పాలసీ రీసెర్చ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా కూడా పని చేశారు. 38ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో జపాన్‌ గ్రామీణ కమ్యూనిటీల పునరుద్ధరణ కోసం ప్రధానంగా కృషి చేశారు. గతంలో నాలుగుసార్లు ఎల్‌డిపి నాయకత్వ పదవికి ఇషిబా పోటీ పడినా ఎన్నడూ విజయం సాధించలేదు. ఈసారి ఐదవ విడతలో విజయం సాధించారు. గత వారం జరిగిన ఈ పోటీ ఇక తన చివరి రాజకీయ పోరు అని ఆయన వ్యాఖ్యానించారు.

➡️