గాజా నగరం : గాజాపై దాడిని ఇజ్రాయిల్ కొనసాగిస్తూనే ఉంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 29 మంది మరణించారు. మృతుల్లో నలుగురు వైద్య సిబ్బంది ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయని మీడియా పేర్కొంది. డ్రోన్ దాడి అనంతరం సైన్యం ఆస్పత్రికి చేరుకుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఆసుపత్రికి సమీపంలోని భవనాలపై కూడా ఇజ్రాయిల్ బలగాలు బాంబు దాడి చేశాయి.