Israel attack : ఇరాన్‌ సైనిక స్థావరాలపై దాడి… శాటిలైట్‌ దృశ్యాలు విడుదల

దుబాయ్ :  ఇరాన్‌ రాజధానికి ఆగేయంగా ఉన్న ఓ రహస్య సైనిక స్థావరం పర్చిన్‌పై జరిపిన దాడికి సంబంధించిన శాటిలైట్‌ దృశ్యాలు విడుదలయ్యాయి. ఈ స్థావరంలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాల తయారీకి సంబంధించిన అధిక పేలుడు పదార్థాల పరీక్షలను ఇరాన్‌ గతంలో నిర్వహించిందని అంతర్జాతీయ అణుశక్తి ఏజన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది.
సమీపంలోని ఖోజీర్‌ సైనిక స్థారవంలో కూడా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో భూగర్భ సొరంగం వ్యవస్థ, క్షిపణి తయారీ ప్రదేశాలను ఉన్నాయని, వాటిని బయటి ప్రపంచానికి తెలియకుండా ఇరాన్‌ దాచిపెట్టిందని ఆరోపించాయి. సైనిక స్థావరాలపై దాడి నష్టాన్ని ఇరాన్‌ ధృవీకరించలేదు. ఇజ్రాయిల్‌ దాడిలో వైమానిక రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న నలుగురు ఇరాన్‌ సైనికులతో పాటు ఓ పౌరుడు మరణించినట్లు ప్రకటించింది. మృతుల వివరాలను వెల్లడించలేదు.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు నైరుతి, పశ్చిమప్రాంతాల్లోని వైమానిక, సైనిక స్థావరాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ వైమానిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిని సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్‌, ఖతార్‌, ఈజిప్ట్‌, యెమెన్‌, మలేషియా, సిరియా, జోర్డాన్‌, లెబనాన్‌ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి.

➡️