గాజా : గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ శనివారం ముగ్గురు పాలస్తీనియన్ల బందీలను విడుదల చేసింది. కీత్ సెగెల్, ఓఫర్ కల్డెరాన్, యార్డెన్ బిబాస్ అనే ఈ ముగ్గురు పాలస్తీనియన్లను గత కొన్ని నెలలుగా ఇజ్రాయిల్ సైన్యం వీరిని బంధించింది. దక్షిణ, ఉత్తర గాజాలోని వేర్వేరు ప్రదేశాల్లో బందీలుగా ఉన్న వీరిని ఇజ్రాయిల్ నేడు విడుదల చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు అయిన దగ్గర నుంచి ఇజ్రాయిల్ ఇప్పటివరకు 183 మంది పాలస్తీనా బందీలను విడుదల చేసింది. రమల్లాలోని బీటునియా అనే ప్రాంతంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఓఫర్ జైలులో ఎంతోమంది పాలస్తీనియన్లు బందీలుగా ఉన్నారు.
