ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం
ఇంటర్నెట్ : ఇజ్రాయిల్ గాజాలో మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని చంపుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మార్చి 18 నుండి ఏప్రిల్ 9 వరకు ఇజ్రాయిల్ 36 వైమానిక దాడులు నిర్వహించింది. వాటిలో మహిళలు, పిల్లలు మాత్రమే మరణించారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 9 వరకు ఇజ్రాయిల్ గాజాలో 224 దాడులు నిర్వహించింది. గాజాలో ఏ ప్రదేశం సురక్షితంగా లేదని యుఎన్ మానవ హక్కుల హైకమిషనర్ రవీనా శందాసాని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఖాన్ యూనిస్‌లో జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు పిల్లలు సహా ఒక కుటుంబానికి చెందిన పది మంది మరణించారు. ఇతర ప్రదేశాలలో మరో ఐదుగురు మరణించారు. గాజాను భూమిపై నరకం అని రెడ్ క్రాస్ అభివర్ణించింది.