గాజా : గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణలో భాగంగా దారుణాలకు పాల్పడుతుంది. ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయిల్ గాజాలో ఆహార సంక్షోభం తీవ్రతరం చేసేందుకు ఆ నగరంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనుంది. ఈ మేరకు ఇంధన మంత్రి ఎలి కోహెన్ ఈ ఉత్తర్వు ఇచ్చారని ఇజ్రాయిల్ వార్తా సంస్థలు నివేదించాయి. నెలల క్రితం గాజాలోని విద్యుత్ ప్లాంట్‌పై ఇజ్రాయిల్ బాంబు దాడి చేసిన తర్వాత, గాజా స్ట్రిప్ వాసులు ఇజ్రాయిల్ నుండి విద్యుత్తుపై ఆధారపడుతున్నారు. ఖతార్ కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభిస్తుందనే బలమైన ఆశల మధ్య గాజాపై మళ్లీ ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయిల్ ఈ చర్య తీసుకుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
