సనా : గాజాలో మొదలు పెట్టి లెబనాన్, సిరియా, ఇరాక్‌కు దాడులను విస్తరింపజేస్తున్న యూదు దురహంకార ఇజ్రాయిల్ తాజాగా యెమెన్‌పై విరుచుకుపడింది. గత రెండు రోజులుగా హౌతీలు ఇజ్రాయిల్‌పై క్షిపణులను ప్రయోగిస్తున్నారన్న సాకుతో నెతన్యాహు ఆ దేశంపై దాడికి తెగబడ్డారు. పశ్చిమాసియా అంతటినీ యుద్ధంలోకి లాగాలని అమెరికాతో కలసి ఇజ్రాయిల్ యత్నిస్తున్నాయి. యుద్ధ విస్తరణకు ఇప్పటికే అనేక ఫ్రంట్‌లను తెరచిన ఇజ్రాయిల్ ఇప్పుడు యెమెన్‌ను కూడా యుద్ధంలోకి లాగుతోంది. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు హౌతీల స్థావరాలే లక్ష్యంగా ఆదివారం దాడి చేశాయని ఇజ్రాయిల్ మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ ఇసా, హోదీదా ఓడరేవులపైన, విద్యుత్ కేంద్రాలపైన బాంబుల వర్షం కురిపించి భీతావహమైన పరిస్థితిని సృష్టించింది.