Japan: ట్రంప్ టారిఫ్ లపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Mar 27,2025 08:42 #Exports, #Japan, #Trump tariffs

టోక్యో: ఆటోమొబైల్ దిగుమతులపై 25% సుంకం విధించాలన్న వాషింగ్టన్ ప్రకటనను ఎదుర్కోవడంలో జపాన్ “అన్ని రకాలుగా” పరిశీలిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా గురువారం అన్నారు. దిగుమతి చేసుకున్న కార్లు, తేలికపాటి ట్రక్కులపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన ప్రారంభించిన ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని విస్తృతం చేశారు. టారిఫ్(సుంకాలు)లపై ప్రధాని ఇషిబా మాట్లాడుతూ… అమెరికాలో గణనీయమైన మొత్తంలో జపాన్ పెట్టుబడులు పెడుతోందని, ఇది ఉద్యోగాలను కూడా సృష్టిస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో అతిపెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్న దేశంగా జపాన్ ఉందని తెలిపారు. కాబట్టి అన్ని దేశాలకు ఏకరీతి సుంకాలను వర్తింపజేయడంతో తాము ఆశ్చర్యపోతున్నామని తెలిపారు.

అమెరికాకు ఆటో ఎగుమతులపై ఆధారపడిన జపాన్ ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య తీవ్ర దెబ్బను చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2024లో జపాన్ అమెరికాకు చేసిన మొత్తం ఎగుమతుల్లో ఆటోమొబైల్స్ 28.3% ఉన్నాయి. అన్ని వస్తువుల ఎగుమతులలో ఇదే అత్యధిక శాతంగా ఉంది.

➡️