జ్యుడిషియల్‌ కమిషన్లు ఏర్పాటు చేయాల్సిందే

  • రాజకీయ ఖైదీలను విడుదల చేయండి
  • ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్ల పత్రంలో పిటిఐ

ఇస్లామాబాద్‌: ప్రభుత్వంతో మూడో రౌండ్‌ చర్చల కోసం పాకిస్తాన్‌ తెహ్రీక్‌- ఎ- ఇన్సాఫ్‌ (పిటిఐ) డిమాండ చార్టర్‌నొకదా నిని సమర్పించింది. తాము గుర్తించిన రాజకీయ ఖైదీలను విడుదల జేయాలని, మే9 నాటి హింసాత్మక ఘటనలపై రెండు జ్యుడిషియల్‌ కమిషన్లు వేయాలని, ఇందులో పాకిస్తాన్‌ చీఫ్‌ జస్టిస్‌, లేదా ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, పిటిఐ, ప్రభుత్వ ప్రతినిధులు ఉండేలా చూడాలని గురువారం లిఖితపూర్వకంగా సమర్పించిన మూడు పేజీల డిమాండ్ల పత్రంలో పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌తో రెండు రోజుల క్రితం పెషావర్‌లో సమావేశమైన పిటిఐ చైర్మన్‌, బారిస్టర్‌ గొహర్‌ అలీఖాన్‌ గురువారం అడియాలా జైలులో ఉన్న తమ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌ను కలుసుకుని చర్చల వివరాలను ఆయనకు నివేదించారు. జ్యుడిషియల్‌ కమిషన్లను వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని, లేకుంటే చర్చలకు దూరంగా ఉంటామని పిటిఐ చైర్మన్‌ హెచ్చరించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదలజేయాలని కోరుతూ నవంబరులో దేశవ్యాపితంగా నిరసన ర్యాలీలు హోరెత్తడంతో రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడం కోసం ప్రభుత్వం, సైన్యం ఒక మెట్టు దిగొచ్చి పిటిఐ నేతలతో చర్చలకు సిద్ధమైంది.

➡️