ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గం : జస్టిన్‌ ట్రూడో

Jan 8,2025 13:37 #Justin Trudeau, #Trump

ఒట్టావా : కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తెరపైకి తెచ్చారు. తాజాగా ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కెనడాను అమెరికాలో విలీనం చేసేందుకు తాను ఆర్థికశక్తిని ఉపయోగిస్తానంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ట్రూడోతోపాటు లిబరల్‌ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికశక్తి వల్ల దేశాల్ని విలీనం చేసే అవకాశం లేదని ట్రూడో సూచించారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు తలొగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు అతిపెద్ద వాణిజ్యం, భద్రతా భాగస్వామిగా ఉండడం వల్ల ప్రయోజనం పొందుతాయి’ అని ట్రూడో అభిప్రాయపడ్డారు. ఇక ట్రూడోకు మద్దతుగా ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపుల నుంచి కెనడా వెనక్కి తగ్గబోదని, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మెలానీ జోలీ ఆరోపించారు. ‘మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలే మాకు బలం. బెదిరింపులకు ఎప్పటికీ వెనక్కి తగ్గం’ అని ఆయన ట్రంప్‌ను హెచ్చరించారు.

➡️