లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్ధి లూయిసా గొంజాలెజ్ కు 43.9 శాతం ఓట్లు
క్విటో: లాటిన్ అమెరికన్ దేశమైన ఈక్వెడార్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష కూటమి(లెఫ్ట్ ఫ్రంట్) గట్టి పోటీనిస్తుంది. మొదటి రౌండ్ ఓటింగ్‌లో వామపక్ష విప్లవ ఉద్యమానికి చెందిన లూయిసా గొంజాలెజ్ 43.9 శాతం ఓట్లను గెలుచుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డేనియల్ నోబోవాకు 44.2 శాతం ఓట్లు వచ్చాయి. నోబోవా సులభంగా గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఎవరూ 50 శాతం ఓట్లు పొందలేకపోవడంతో రెండవ ఎన్నికలు ఏప్రిల్‌లో జరుగుతాయి.
ఈక్వెడార్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలు లూయిసా (47) ప్రముఖ న్యాయవాది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, శాంతిభద్రతల పరిస్థితిని ప్రజలు విచ్ఛిన్నం చేశారని ఆమె అన్నారు. లూయిసా ఈక్వెడార్‌లో జనవరి నుండి మే 2017 వరకు రాఫెల్ కోహియా ప్రభుత్వంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా పనిచేశారు.