2026 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్న లూలా

Dec 13,2024 23:47 #Lula Da Silva

బ్రసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డసిల్వా 2026 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేయనున్నారు. అధ్యక్షుని సోషల్‌ కమ్యూనికేషన్‌ సెక్రటరీ పౌలో పిమెంటా సిఎన్‌ఎన్‌ బ్రసిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలను ధ్రువీకరించారు. మెదడు రక్తనాళాల్లో తలెత్తిన సమస్యకు చికిత్స తీసుకున్న తరువాత లూలా ఆరోగ్యంగా బాగానే ఉన్నారని పిమెంటా తెలిపారు. ఆయన దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారని, ప్రతిపక్షాలే ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

➡️