Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ

కెనడా: కెనడా లిబరల్ పార్టీ దేశ తదుపరి ప్రధానమంత్రిగా మార్క్ కార్నీని అత్యధిక మెజారిటీతో ఎన్నుకుంది. జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. తుది లెక్కల ప్రకారం, లిబరల్ పార్టీ నాయకత్వ ఓట్లలో పోలైన బ్యాలెట్లలో కార్నీ 85.9% సాధించి గెలిచారు. జస్టిన్ ట్రూడో స్థానంలో కార్నీ బాధ్యతలు స్వీకరించి, కొంత కాలం  మాత్రమే ఆ పదవిలో ఉంటాడు. ఎందుకంటే కెనడాలో అక్టోబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలి. విజయోత్సవ సభలో కార్నీ మాట్లాడుతూ… ట్రంప్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్(యుఎస్) కెనడాను నియంత్రణ సాధించేందుకు  ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. యుఎస్ కెనడా వనరులను, నీటిని, భూమిని, దేశాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కెనడియన్ కార్మికులు, కుటుంబాలు, వ్యాపారాలపై ట్రంప్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

➡️