ఇస్లామాబాద్: జైలులో ఉన్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌పైన, ఆయన భార్య పైన, మరి కొందరు అనుచరులపైన పాక్ పోలీసులు గురువారం పలు అభియోగాఆలు మోపారు. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదలజేయాలని కోరుతూ మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ నిర్వహించిన సందర్భంగా ప్రజలను హింసకు ప్రేరేపించారంటూ పలు అభియోగాలను వీరిపై మోపారు. లాంగ్ మార్చ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో ఆరగురు చనిపోయిన సంగతి తెలిసిందే.