గాజాసిటీ: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో యూదుల ఆవాస కాలనీల ఏర్పాటుకు ఇజ్రాయిల్ పథక రచన చేసింది. పాలస్తీనా భూభాగంలో 3,500 ఇళ్లతో యూదులకు కొత్త సెటిల్మెంట్ కాలనీలు నిర్మించేందుకు పథకం రూపొందించామని ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ చెప్పారు. నెతన్యాహు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వెస్ట్ బ్యాంక్‌లో వేలాది యూదు సెటిల్మెంట్ కాలనీలను అక్రమంగా నిర్మించింది.
