Mount Everest : 36 శాతం పెరిగిన పర్వతారోహణ రుసుము

ఖాట్మాండు :   ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎవరెస్ట్‌ పర్వతారోహణ రుసుమును నేపాల్‌ ప్రభుత్వం 36 శాతం పెంచింది. ఎవరెస్ట్‌పై చెత్త, కాలుష్యాన్ని నివారించేందుకు అనేక చర్యలను కూడా ప్రవేశపెట్టినట్లు అధికారులు గురువారం ప్రకటించారు.

సవరించిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం.. మార్చి -మే మధ్య (వసంతరుతువు) సాధారణ దక్షిణ మార్గం నుండి ఎవరెస్ట్‌ను అధిరోహించే విదేశీయులకు రాయాల్టీ రుసుము ప్రస్తుతం ఉన్న 11,000 అమెరికన్‌ డాలర్ల నుండి 15,000 అమెరికన్‌ డాలర్లకు పెంచింది. సెప్టెంబర్‌ -నవంబర్‌ మధ్య (శరధృతువు) పర్వతారోహణకు 5,500 అమెరికన్‌ డాలర్ల నుండి 7,500 అమెరికన్‌ డాలర్లకు పెంచింది. అదే సమయంలో డిసెంబర్‌ -ఫిబ్రవరి (శీతాకాలం) మధ్య, జూన్‌ -ఆగస్టు మధ్య ( వర్ష రుతువు) సీజన్‌లలో ఒక్కో వ్యక్తిని అనుమతించేందుకు 2,750 అమెరికా డాలర్ల నుండి 3,750కి పెంచింది.

పెరిగిన రుసుములు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుండి అమల్లోకి రానున్నాయని పర్యాటక రంగం డైరెక్టర్‌ పేర్కొన్నారు.  క్యాబినెట్‌ ఆమోదించిన సవరించిన నిబంధనలు నేపాల్‌ ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రకటించగానే అమల్లోకి వస్తాయని తెలిపారు.

➡️