ట్రంప్‌తో ముకేశ్‌ అంబానీ దంపతులు భేటీ

Jan 20,2025 07:46 #Donald Trump, #Mukesh Ambani

వాషింగ్టన్‌ డిసి : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒక రోజు ముందు డోనాల్డ్‌ ట్రంప్‌తో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దంపతులు భేటీ అయ్యారు. యుఎస్‌ క్యాపిటల్‌లో జరిగే ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంబానీ దంపతులు హాజరుకానున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్‌ క్యాబినెట్‌ మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖ అతిథులతో ఈ జంట కూడా వేదికపై ఉంటారని పేర్కొన్నారు. ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య, రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబాని ఈ నెల 18నే వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆదివారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరవుతారు.

➡️