- ఆస్ట్రేలియా దిగువ సభలో బిల్లు ఆమోదం
సిడ్నీ : 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విషయంలో ఆస్ట్రేలియా ఒక అడుగు ముందుకేసింది. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఆస్ట్రేలియా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో 102 మంది సభ్యులు మద్దతివ్వగా, 13 మంది వ్యతిరేకించారు. ఈ బిల్లుకు మేజర్ పార్టీలు మద్దతు పలికాయి. ఈ బిల్లు ప్రకారం.. 16 ఏండ్ల లోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండటాన్ని నిరోధించే విషయంలో విఫలమైతే.. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు 50 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల వరకు జరినామా చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు అమలు తర్వాత పెనాల్టీలను ఎదుర్కొనే ముందు.. వయో పరిమితులను అమలు చేయటానికి సోషల్ మీడియా కంపెనీలకు ఒక సంవత్సరం సమయం ఉంటుంది.