స్టాకహేోం : భౌతిక శాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్త జాన్ జె.హప్‌ఫీల్డ్, కెనడియన్ బ్రిటీష్ శాస్త్రవేత్త జఫరీ ఇ.హింటన్‌లకు నోబెల్ బహుమతి లభించింది. కృత్రిమమైన న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌కు వీలు కల్పించే ప్రాధమిక ఆవిష్కరణలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వారిని వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. శక్తివంతమైన మెషిన్ లెర్నింగ్‌కు పునాదులుగా నేడున్న పద్దతులను అభివృద్ధిపరచడానికి భౌతిక శాస్త్రంలోని సాధనాలను ఉపయోగించి ఈ ఆవిష్కరణలు చేశారని అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. వీరి కృషి ఇప్పటికే మహత్తర ప్రయోజనాలను అందిస్తోందని నోబెల్ కమిటీ ఛైర్మన్ ఎలెన్ మూన్స్ వ్యాఖ్యానించారు.
