లండన్ : నార్త్ సీలో సోమవారం సరుకుల నౌక, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 32మంది గాయపడ్డారు. మంటలతో దగ్ధమవుతున్న ట్యాంకర్‌లో సిబ్బంది అందరూ జీవించే వున్నారని నౌక యజమాని చెప్పారు. గాయపడిన వారందరినీ వెంటనే ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం మూడు నౌకలు రంగంలోకి దిగాయి. చమురు పెద్ద మొత్తంలో లీకై మండుతుండడంతో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడం టివి దృశ్యాల్లో కనిపిస్తోంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని తీర ప్రాంతానికి 16కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
