Kenya ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు.. ఒకరు మృతి

నైరోబి :    కెన్యాలో ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మంగళవారం రాజధాని నైరోబీ సహా పలు ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై టియర్‌గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. కిటెంగేలాలో ఓ ఆందోళనకారుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. కెన్యా అధ్యక్షుడు విలియమ్‌ రూటో రాజీనామా చేయాలంటూ ప్రజలు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమపై పోలీసులు ఎందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారనిజోసెఫ్‌ గికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఆయుధాలు లేవని, కేవలం జెండాలు మాత్రమే పట్టుకున్నామని అన్నారు.

కొన్ని వ్యవస్థీకృత క్రిమినల్‌ బృందాలు చొరబాటుకు, శాంతియుత నిరసనకు భంగం కలిగించేందుకు కుట్ర పన్నినట్లు మంగళవారం ఉదయం తమకు సమాచారం అందిందని తాత్కాలిక జాతీయ పోలీస్‌ చీఫ్‌ డోగ్లస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీరు నిరసనకారుల భద్రతకు ప్రమాదకరం కావచ్చని అన్నారు.

➡️