7దేశాలు మాత్రమే డబ్ల్యుహెచ్‌ఒ ఎక్యూఐ ప్రమాణాలకు చేరాయి : నివేదిక

సింగపూర్‌ :   గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సూచించిన వాయు నాణ్యతా ప్రమాణాలను (ఎక్యూఐ) కేవలం ఏడు దేశాలు మాత్రమే చేరుకున్నాయని నివేదిక మంగళవారం తెలిపింది. 2024లో చాద్‌ మరియు బంగ్లాదేశ్‌ ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాలుగా నిలిచాయని, సగటు పొగమంచు స్థాయిలు డబ్ల్యుహెచ్‌ఒ మార్గదర్శకాల కంటే 15 రెట్లు అధికంగా ఉన్నాయని స్విస్‌ వాయు నాణ్యతా పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎఐఆర్‌ తెలిపింది. చాద్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, కాంగో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ తర్వాత పొగమంచు ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఐదవ స్థానంలో నిలిచినట్లు నివేదిక తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బహమాస్‌, బార్బడోస్‌, గ్రెనడా, ఎస్టోనియా, ఐస్లాండ్‌లు మాత్రమే ఈ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నాయని ఐక్యూఎఐఆర్‌ పేర్కొంది. భారత్‌ 2022తో పోలిస్తే సగటు పిఎం 2.57 శాతం తగ్గి 50.6 ఎంజి/క్యూ.ఎంకి చేరుకుందని తెలిపింది. డబ్ల్యుహెచ్‌ఒ 5 ఎంజి/సియు.ఎం కంటే ఎక్కువ స్థాయిలను సిఫారసు చేయగా.. ఈ ప్రమాణాన్ని గతేడాది కేవలం 17 శాతం నగరాలు మాత్రమే చేరుకున్నాయి.

అధికమౌతున్న వాతావరణ మార్పులు కాలుష్యాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఐక్యూఎఐఆర్‌ మేనేజర్‌ చెస్టర్‌ -ష్రోడర్‌ హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతలు ఆగేయాసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టిన కార్చిచ్చులు కారణమవుతున్నాయని అన్నారు

అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశ పొగమంచు స్థాయిలను ట్రాక్‌ చేయడానికి అమెరికా రాయబార కార్యాలయం, దౌత్య భవనాలపై అమర్చిన వాయు నాణ్యతా సెన్సార్లపై ఆధారపడ్డాయి. వాయు నాణ్యతపై ప్రపంచ పర్యవేక్షణా యత్నాలను ఇటీవల అమెరికా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌ నియంత్రణా చర్యల్లో భాగంగా పేర్కొంటూ   గతవారం అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వాయు నాణ్యతా ప్రమాణాలను కొలిచే వెబ్‌సైట్‌  airnow.gov నుండి చాద్‌ సహా అన్ని దేశాలకు చెందిన 17 ఏళ్లకు పైగా ఉన్న సమాచారాన్ని తొలగించింది.  దీంతో పొగమంచుపై యుద్ధం కష్టతరం అవుతుందని పరిశోధకులు హెచ్చరించారు.

➡️