ఇస్లామాబాద్ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కిడ్నాప్‌కి సహకరించిన ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి సహకరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కెచ్‌లోని టర్బాట్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం మసీదు నుండి వెళుతుండగా కెచ్‌లోని టర్బాట్ నగరంలో కొందరు దుండుగులు ముఫ్తీ షా మిర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారని, వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు ఆదివారం ఆ ప్రకటన తెలిపింది.
ముఫ్తీ షా మీర్ జమాయత్ ఉలేమా -ఇ-ఇస్లాం (జెయుఐ-ఎఫ్) సంస్థకి సన్నిహితంగా ఉండే ఆయనపై గతంలో రెండు హత్యాయత్నాలు జరిగాయి. అయితే వాటి నుండి తప్పించుకోగలిగారని మీడియా తెలిపింది. ఖుజ్దూర్‌లో ఇద్దరు జెయుఐ-ఎఫ్ నేతలను కాల్చి చంపిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.