ఇమ్రాన్‌ఖాన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన పాకిస్థాన్‌ కోర్టు

ఇస్లామాబాద్‌ :   అక్రమాస్తుల కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను నిర్దోషిగా విడుదల చేయాలన్న పిటిషన్‌ను పాకిస్థాన్‌ కోర్టు గురువారం తిరస్కరించింది.   తదుపరి విచారణను కోర్టు నవంబర్‌ 18కి వాయిదా వేసింది.
మాజీ ప్రధాని, ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని ఖాన్‌ తరపు న్యాయవాది నయీమ్‌ పంజుత ధృవీకరించారు. ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.
ఇమ్రాన్‌ఖాన్  అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన బహుమతులను  ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి  విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో  ఇమ్రాన్‌ఖాన్‌కు ఏడాదికి పైగా జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.

➡️