PM Modi : ఆస్ట్రియా చేరుకున్న భారత ప్రధాని

Jul 10,2024 11:33 #Austria, #first visit, #PM Modi

వియన్నా :   రష్యా పర్యటన అనంతరం ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఆయనకు ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ స్చాలెన్‌బర్గ్‌ స్వాగతం పలికారు. బుధవారం రిపబ్లిక్‌ ఆఫ్‌ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డెర్‌ బెలెన్‌తో సమావేశం కానున్నారు. అలాగే ఆస్ట్రియా ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో చర్చలు జరపున్నారు. ప్రధాని మరియు ఛాన్సలర్‌ ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ ఏడాది రెండు దతేశాలు దౌత్య సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ పర్యటన భారత్‌, ఆస్ట్రియా దేశాల సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ  ప్రతినిది  ఓ ప్రకటనలో తెలిపింది.

40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 1983లో ఇందిరాగాంధీ ఆ దేశాన్ని సందర్శించారు.

➡️