ఆస్పత్రిలో చేరిన పోప్‌ ఫ్రాన్సిస్‌

Feb 14,2025 21:22 #Pope

బ్రాంకైటీస్‌తో ఇబ్బందులు
వాటికన్‌ సిటీ : శ్వాసకోశ సమస్య (బ్రాంకైటీస్‌) తో ఇబ్బంది పడుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ను శుక్రవారం ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రాబోయే మూడు రోజుల్లో ఆయన పాల్గనాల్సిన పలు కార్యక్రమాలు రద్దయ్యే అవకాశం వుంది. శుక్రవారం ఉదయం జరిగిన సమావేశాల్లో మాట్లాడేందుకు పోప్‌ ఇబ్బంది పడడం కనిపించిందని, అందుకే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళినట్లు వాటికన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజులకు పైగా పోప్‌ శ్వాసనాళాల వాపుతో బాధపడుతున్నారని తెలిపింది. ఆయనకు చికిత్స కొనసాగిస్తూ, కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2013 నుండి పోప్‌గా బాధ్యతలు చేపట్టిన ఫ్రాన్సిస్‌ గత రెండేళ్ళుగా ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. యువకుడిగా వున్నపుడే ఆయన ఒక ఊపిరితిత్తిలోని కొంత భాగాన్ని తొలగించారు. ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాగా ఎక్కువగా బాధపడుతున్నారు. మానసికంగా ఆయన ఆరోగ్యంగానే వున్నారని, కానీ మాట్లాడడంలోనే ఇబ్బందులు అధికంగా ఎదుర్కొంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

➡️