ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ముందే నిరసన సెగ

Jan 20,2025 00:22 #against, #America, #Donald Trump

వాషింగ్టన్‌సహా పలు నగరాలలో ఆందోళనలు
‘ట్రాన్స్‌ లివ్స్‌ మ్యాటర్‌’, ‘స్టాండప్‌… ఫైట్‌ బ్యాక్‌’, ట్రస్ట్‌ బ్లాక్‌ ఉమెన్‌’, ‘ఉరు కాంట్‌ బి సైలెంట్‌’ అంటూ నినాదాలు
వాషింగ్టన్‌ : అమెరికా 47వ అధ్యక్షుడుగా డోనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపడుతున్న తరుణంలో వాషింగ్టన్‌ నగరం నిరసనలతో హోరెత్తింది. ట్రంప్‌ విధానాలను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘ట్రాన్స్‌ లివ్స్‌ మ్యాటర్‌’, ‘స్టాండప్‌… ఫైట్‌ బ్యాక్‌’, ట్రస్ట్‌ బ్లాక్‌ ఉమెన్‌’, ‘ఉరు కాంట్‌ బీ సైలెంట్‌’ అంటూ వారంతా నినాదాలు చేశారు. ‘సఖి ఫర్‌ సౌత్‌ ఆసియా సర్వైవర్స్‌’ సహా పలు స్వచ్ఛంద సంస్థలు పీపుల్స్‌ మార్చ్‌ పేరిట నిరసన చేపట్టాయి. పీపుల్స్‌ మార్చ్‌ని గతంలో ఉమెన్స్‌ మార్చ్‌ అని పిలిచే వారు. 2017 నుంచి ప్రతి సంవత్సరం ఇది జరుగుతోంది. ట్రంప్‌ వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శించిన నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టెస్లా యజమాని ఎలన్‌ మస్క్‌ సహా ట్రంప్‌ సన్నిహిత మద్దతుదారులను కూడా వారు వదిలిపెట్టలేదు. 2017 జనవరిలో ట్రంప్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు సైతం వీరు ఇదే రకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
నగరంలోని మూడు వేర్వేరు పార్కుల నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు లింకన్‌ మెమోరియల్‌ సమీపాన కలిసిపోయాయి. ‘ఫాసిజా నికి తలవంచబోమని సమాజానికి చాటిచెప్పేందుకే భారీ ప్రదర్శన చేపట్టాం’ అని పీపుల్స్‌ మార్చ్‌ తెలి పింది. ప్రమాణస్వీకారానికి ముందు అనేక కార్యక్రమాలకు హాజరయ్యేం దుకు ట్రంప్‌ ఇప్పటికే వాషింగ్టన్‌ చేరుకున్నారు. అదే సమయంలో నిరసన ప్రదర్శనలు జరగడం గమనార్హం. అబార్షన్‌ యాక్షన్‌ నౌ, టైమ్‌ టూ యాక్ట్‌, సిస్టర్‌సాంగ్‌, ఉమెన్స్‌ మార్చ్‌, పాప్యులర్‌ డెమొక్రసీ ఇన్‌ యాక్షన్‌, హర్రియట్స్‌ వైల్డెస్ట్‌ డ్రీమ్స్‌, ది ఫిమినిస్ట్‌ ఫ్రంట్‌, నౌ, ప్లాన్డ్‌ పేరెంట్‌హుడ్‌, ది నేషనల్‌ ఉమెన్స్‌ లా సెంటర్‌ యాక్షన్‌ ఫండ్‌, సియర్రా క్లబ్‌, ఫ్రంట్‌లైన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వాములయ్యాయి. న్యూయార్క్‌, సియాటెల్‌, చికాగో వంటి ఇతర నగరాలలోనూ నిరసన ప్రదర్శ నలు జరిగాయి. మహిళలు, సమానత్వం, ఇమ్మిగ్రేషన్‌ కు మద్ద తుగా వచ్చామని బ్రిట్టానీ మార్టినెస్‌ అనే యువతి చెప్పారు. ట్రంప్‌ విధానాలు, విలువలపై నిరసనకారులు మండిపడ్డారు.

➡️