వాషింగ్టన్ : అదానీ గ్రూప్ చేపట్టిన శ్రీలంక ఓడరేవు ప్రాజెక్టుకు 553 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించే విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఓ అమెరికా సంస్థ పునఃసమీక్షిస్తోంది. అవినీతి, మోసం ఆరోపణలపై అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై అమెరికా న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టుకు 553 మిలియన్ డాలర్ల రుణాన్ని అందజేసేందుకు గత నవంబరులో ఈ సంస్థ అంగీకరించింది.