సియోల్ : దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ శనివారం జైలు నుండి విడుదలయ్యారు. భౌతికంగా ఆయనను నిర్బంధించకుండా విచారణకు అనుమతించాలని పేర్కొంటూ ఆయన అరెస్టును రద్దు చేస్తూ సియోల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విడుదల చోటు చేసుకుంది. జైలు బయట వేచి వున్న తన మద్దతుదారులకు అభివాదంచేస్తూ యూన్ బయటకు రావడాన్ని టివిలు ప్రసారం చేశాయి. జనవరి 3న కొద్ది గంటల పాటు దేశంలో సైనిక పాలన విధించిన దేశంలో రాజకీయ సంక్షోభానికి కారణమయ్యారంటూ యూన్‌ను అరెస్టు చేశారు. ఆయనను అభిశంసిస్తూ ప్రతిపక్షం నేతృత్వంలోని నేషనల్ అసెంబ్లీ ఓటు వేయడంతో ఆయనను అధికారం నుండి సస్పెండ్ చేశారు.
