- 123 దేశాల విజ్ఞప్తి
హవానా : క్యూబపై ఉగ్రవాద ముద్ర వేయడం ఎంతమాత్రం సరికాదని123 దేశాలు ముక్త కంఠంతో ప్రకటించాయి. ఈ మేరకు ఓ డిక్లరేషన్‌పై అవి సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఈ డిక్లరేషన్‌ను జారీ చేసింది. క్యూబాను దుష్ట రాజ్యాల జాబితాలో చేర్చి, ఆ దేశంపై ఆరున్నర దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. క్యూబాకు ఇంత పెద్ద స్థాయిలో మద్దతును, తోడ్పాటును అందించినందుకు క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్యూబా విదేశాంగ శాఖ మేగజైన్‌లో ఈ డిక్లరేషన్‌ను ప్రచురించారు. అన్యాయంగా తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం, దానికి కొనసాగింపుగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు.