ceasefire : ఖతార్‌కు ఇజ్రాయిల్ ప్రతినిధుల బృందం

డేరియల్‌ /గాజాస్ట్రిప్‌ :   గాజాతో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతినిధుల బృందాన్ని పంపనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. ప్రతినిధుల బృందాన్ని సోమవారం ఖతార్‌కు పంపనున్నట్లు తెలిపింది. ”అమెరికా మద్దతుగల మధ్యవర్తుల ఆహ్వానాన్ని అంగీకరించింది”అని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాల్పుల విరమణ రెండవ దశ ప్రారంభించడంపై ఈజిప్ట్‌ మరియు ఖతార్‌ మధ్యవర్తులతో జరిగిన చర్చలలో హమాస్‌ సానుకూలంగా స్పందించిందని నివేదించింది.

ఈ ప్రకటనపై హమాస్  ప్రతినిధి అబ్దేల్‌ -లతీఫ్‌ అల్‌ కనౌవా కూడా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు.   కాల్పుల విరమణకు సంబంధించి రెండవ దశపై చర్చలు ఒక నెల ముందే ప్రారంభం కావాల్సి వుంది.

➡️