కెనడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి

Feb 11,2024 11:01 #3 death, #Canada, #road accident

బ్రాంప్టన్ : కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. గ్రేటర్‌ టొరంటోని బ్రాంఫ్టన్‌ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిని రితిక్‌ ఛబ్రా(23), అతని తమ్ముడు రోహన్‌(22), గౌరవ్‌ ఫాస్గే(24)గా గుర్తించారు. అతి ఎదురెదురుగా రెండు వాహనాలు ఢకొీనడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురూ బ్రాంప్టన్‌లోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్నట్టు వెల్లడించారు. చబ్రా సోదరులు చండీగఢ్‌కు చెందినవారు కాగా.. ఫాస్గే పూణేకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

➡️