నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రెవోస్ట్‌

వాటికన్‌ సిటీ : రోమన్‌ కాథలిక్‌ చర్చి నూతన పోప్‌, నాయకుడిగా అమెరికన్‌ కార్డినల్‌ రాబర్ట్‌ ప్రెవోస్ట్‌ గురువారం ఎన్నికయ్యారు. పోప్‌గా ఎన్నికగానే పోల్‌ లియోగా తన పేరును మార్చుకున్నారు. పోప్‌ ఎన్నిక కోసం వాటికన్‌ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 133 మంది కార్డినల్స్‌ రెండు రోజుల పాటు సమావేశ మయ్యారు. వీరిలో కనీసం 89 మంది ఓట్లతో కొత్త పోప్‌ను ఎన్నుకున్నారు. పోప్‌గా ఓ అమెరికన్‌ ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. సమావేశం రెండోరోజు పోప్‌ ఎన్నిక పూర్తికాగానే సంప్రదా యబద్దంగా సిస్టీన్‌ చాపెల్‌ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వెలువడింది. సెయింట్‌ పీటర్స్‌ బసిలికా గంటలు మోగాయి. దీంతో సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లోని జనసమూహం హర్షద్వానాలతో హోరెత్తింది. కొత్త పోప్‌ ఎవరో తెలుసుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు పదివేల మంది సెయింట్‌ పీటర్స్‌ వద్ద రోజులతరబడి వేచి ఉన్నారు.

➡️