సూడాన్‌లోని చిట్టచివరి ఆస్పత్రిపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ కాల్పులు

Jun 10,2024 17:09 #attack, #Rapid Support Forces, #sudan

ఖార్టూమ్‌  :    సూడాన్‌లోని పారామిలటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) డార్ఫర్‌ ప్రాంతంలో పనిచేస్తున్న చివరి ఆస్పత్రిపై దాడి చేసినట్లు అంతర్జాతీయ సహాయ సంస్థ తెలిపింది. ఉత్తర డార్ఫర్‌ ప్రావిన్స్‌ రాజధాని ఎల్‌ఫషర్‌లోని దక్షిణ ఆస్పత్రిపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ దాడి చేశాయని ఎంఎస్‌ఎఫ్‌ (వైద్యుల బృందం) ఆదివారం తెలిపింది. రోగులు, వైద్య సిబ్బందిపై కాల్పులు జరిపారని పేర్కొంది.  దాడి సమయంలో ఆస్పత్రిలో పది మంది రోగులు, తగిన వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారని, ఇప్పటికే సూడాన్‌ వైద్య శాఖ తరలింపు చర్యలను ప్రారంభించిందని ఎంఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో మృతులు, గాయపడిన వారిని గుర్తించలేకపోయామని వెల్లడించింది.   ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఆస్పత్రి లోపల కాల్పులు జరపడం దారుణం. గత కొన్ని వారాలుగా అన్ని వైపుల నుండి జరుగుతున్న దాడులను భరిస్తున్నారని, కానీ ఆస్పత్రి లోపల కాల్పులు చేపట్టడం లైన్‌ను దాటడమేనని ఎంఎస్‌ఎఫ్‌ హెడ్‌ మైఖేల్‌ లాఖరైట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️