Russia Ukraine War : రష్యా సైన్యంలో 16మంది భారతీయులు గల్లంతు

మాస్కో : రష్యా సైన్యంలో పనిచేస్తును 16మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు రష్యా తెలియచేసిందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఇప్పటివరకు రష్యా మిలటరీలో పనిచేస్తున్న వారిలో 12మంది భారతీయులు మరణించారని వెల్లడించింది. రష్యా సైన్యంలో మొత్తంగా 126మంది భారతీయులు పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరిలో 12మంది మరణించగా, 16మంది గల్లంతయ్యారు. మరో 96మంది భారత్‌కు తిరిగివచ్చారు. వారు రష్యా సాయుధ బలగాల నుండి డిశ్చార్జ్‌ అయ్యారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ చెప్పారు. ఇటీవలే మరణించిన బినిల్‌ టి.బి. అవశేషాలను భారత్‌కు రప్పించేందుకు భారత ఎంబసీ కృషి చేస్తోందని చెప్పారు. ఒక సైనికుడు గాయపడి మాస్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రష్యా ఆర్మీలో ఇంకా 18మంది భారతీయులు వుండగా, వారిలో 16మంది గల్లంతైనట్లు సమాచారమందిందని ఆయన చెప్పారు. మిగిలిన వారిని త్వరగా విడుదల చేసి స్వదేశానికి పంపాలని కోరుతున్నట్లు చెప్పారు.

➡️