కీవ్ : ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో 21 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ప్రకటించారు. ఆదివారం పామ్ సండే వేడుక సందర్భంగా ప్రజలు చర్చికి వెళుతుండగా క్షిపణి దాడి జరిగిందని, 21 మంది మరణించగా, ఏడుగురు చిన్నారులు సహా 83 మంది గాయపడ్డారని అన్నారు. 2023 తర్వాత ఉక్రేనియన్ పౌరులపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడిగా పేర్కొన్నారు.
ఈదాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. సుమీపై భయంకరమైన రష్యా బాలిస్టిక్ క్షిపణిదాడి. రష్యన్ క్షిపణులు సాధారణ నగర వీధిని తాకాయని, నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు ధ్వంసమయ్యాయని ఎక్స్‌లో పేర్కొన్నారు.