విదేశీ చెల్లింపులకు ఒకటే వడ్డీ రేటు

  • శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్ణయం

కొలంబో : శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ తన మానిటరీ పాలసీలో భాగంగా అంతర్జాతీయ బాండ్‌ హోల్డర్లకు రుణాలపై బేస్‌ వడ్డీ రేటు 8 శాతం చెల్లించాలని నిర్ణయించింది. ఇది అన్నిటికీ వర్తిస్తుందని.. ద్రవ్య పరపతి విధానాన్ని సులభతరం చేసినట్లు అక్కడి సెంట్రల్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఇంతక్రితంతో పోల్చితే వడ్డీ భారం 50 బేసిస్‌ పాయింట్లు తగ్గనుందని పేర్కొంది. ఇది వరకు రెండు రకాల వడ్డీ రేట్లు అమల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్‌ సావరిన్‌ బాండ్లకు చెందిన 12.55 బిలియన్‌ డాలర్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఆ దేశం ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ ప్రకటన చేసింది. శ్రీలంకకు ఇచ్చిన అప్పుల్లో సౌత్‌ ఆసియన్‌ దేశాల ప్రయివేటు రుణగ్రహీతలు 27 శాతం తగ్గించుకోవడానికి ఇటీవలే ముందుకు వచ్చాయి.

➡️